మహాలక్ష్మీదేవి అలంకారంలో యాదాద్రి పర్వత వర్ధిని అమ్మవారు

17-10-2026 | 06:16pm

యాదగిరిగుట్ట, అక్టోబర్ 17 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy) వారి అనుబంధ ఆలయమైన పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో(Ramalingeswara Swamy Temple) శ్రీ దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం అమ్మవారు మహాలక్ష్మీదేవి అమ్మవారిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం ప్రాతఃకాల పూజ  పారాయణాలు, శ్రీ దేవీ మూలమంత్ర జపములు, లలిత సహస్రనామార్చన మధ్యాహ్నం శ్రీ దేవీ చతుషష్టి ఉపచార పూజ నీరాజన మంత్ర పుష్పములు తీర్థప్రసాద వినియోగం జరిగినాయి. సాయంకాలం  నవావరణ పూజ, కుంకుమార్చనలు, సువాసినీ పూజ, మంత్రపుష్పములు తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. నేడు చండీహవనము కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇందులో పాల్గొనే దంపతులు 1250/- రూపాయల టికెట్ పొంది సాంప్రదాయ దుస్తులతో పాల్గొనాలని అన్నారు.

మరిన్ని వార్తలు