అమరజీవి కుంరం సూరు వర్ధంతి పోస్టర్లు విడుదల

31-10-2026 | 06:18pm

ఉట్నూర్,(విజయక్రాంతి): కొమురం భీం అనుచరుడు అమరజీవి కుంరం సూరు వర్ధంతి ని విజయవంతం చేయాలని నిర్వహణ కమిటీ చైర్మన్ టేకం భీమ్రావు, కన్వీనర్ కుమ్ర రాజు, కోలాం సేవా సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి సి డాం బాపురావు లు కోరారు. శనివారం మండలంలోని దంతనపల్లి కొలాం గూడలో ని సూరు విగ్రహం వద్ద  నవంబర్ 4న జరగనున్న  వర్ధంతి పోస్టర్లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో  నిజాం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గిరిజనుల హక్కులు, భూముల రక్షణ కోసం గోండు వీరుడు కొమరం భీమ్ వెంట ఉండి కుంరం సూరు సైతం  పోరాటాలు చేశారని ఆయన అడుగుజాడల్లో పయనిస్తూ కోలాం గిరిజనుల హక్కుల సాధన కోసం కృషి చేస్తామన్నారు.

ఈ వర్ధంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా  ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్, ఆదిలాబాద్ ఎంపీ  గోడం నగేష్, ఎమ్మెల్యేలు వెడమ బొజ్జు పటేల్, పాయల శంకర్, అనిల్ జాదవ్, కోవలక్ష్మి  లతోపాటు  జిల్లా కలెక్టర్ రాజార్శి షా, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి  మంద మకరందు, సబ్ కలెక్టర్  కొయ్యడ ప్రణయ్ కుమార్, ఏ ఎస్ పి  రిత్విక్ సాయి కొట్టే  లతోపాటు పలువురు అధికారులు, గిరిజన సంఘాల నాయకులు హాజరవుతున్నందున  కోలాం గిరిజనులు అధిక సంఖ్యలో హాజరై వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  కోరారు. ఈ కార్యక్రమంలో కోలాం పీవీ టీజీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు  టేకం వసంతరావు, పటేల్ టేకం చిన్ను, మడవిజంగు, టేకం జంగు, కడప లేదు, ఆత్రం శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు