చిన్నారి వైద్య చికిత్సకు రూ.4 లక్షల ఎల్‌ఓసీ అందజేత

31-10-2026 | 06:25pm

మేడి తులసి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే  మట్టా రాగమయి

ఎమ్మెల్యే చొరవపై కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి కుటుంబ సభ్యులు

సత్తుపల్లి,(విజయ క్రాంతి): సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీ, రోడ్ నంబర్ 7లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన మేడి తులసి (4) అనే చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు రూ.4 లక్షల విలువైన ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ను సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(MLA Dr. Matta Ragamayi Dayanand) అందజేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు ఎమ్మెల్యే చొరవ తీసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు