మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

31-10-2026 | 06:10pm

400 మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు. ఉచితంగా మందుల పంపిణీ

వెల్దుర్తి,(విజయక్రాంతి): వెల్దుర్తి మండల కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి ఆసుపత్రి సౌజన్యంతో  కొంపల్లి శ్రీ మీరు హాస్పటల్ వారి  ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి(Mega Medical Camp) విశేష స్పందన లభించింది. ఈ శిబిరానికి 400 మందికి పైగా రోగులు హాజరయ్యారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.శిబిరానికి  వెల్దుర్తి గ్రామ సర్పంచ్ దండెం ఆదర్శ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని శ్రీ మహాలక్ష్మి ఆస్పత్రి చైర్మన్ కొమరిశెట్టి నరేంద్ర గుప్తా, డాక్టర్ జి శ్రీకాంత్ ను అలాగే శ్రీ మీరు ఆసుపత్రి సిబ్బందిని, అభినందించారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈసీజీ పరీక్షలు నిర్వహించి, అలాగే షుగర్ పరీక్షలు కూడా నిర్వహించి, వైద్య సలహాలు అందించారు.

మహిళలకు, వృద్ధులకు,మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు శ్రీ మహాలక్ష్మి చైర్మన్ నరేందర్ గుప్తా  తెలిపారు.భవిష్యత్తులోనూ ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీఈఓ అవినాష్ గౌడ్, డాక్టర్, కస్తూరి, డాక్టర్ విశాలా, డాక్టర్ చరణ్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్, జనరల్ మేనేజర్ బండ నర్సింలు, మేనేజర్ మల్యాద్రి, స్థానిక ప్రజలు శ్రీ మీరు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు