కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ కి ఘన నివాళులు

31-10-2026 | 06:04pm

మఠంపల్లి: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్, సీనియర్ నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి  మాట్లాడుతూ దేశ ఐక్యత,సమగ్రత కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.పేదలు, రైతులు,కార్మికుల సంక్షేమం కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని పేర్కొన్నారు.

దేశ అభివృద్ధికి,ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆమె చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాలోతు సక్రు నాయక్, ఏసుమల్ల వీరలక్ష్మి పాపాయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మన్ బాబు, సీనియర్ నాయకులు నవీన్ నాయక్, మహేష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు కొత్తపల్లి శౌరి, వివిధ గ్రామాల సర్పంచ్లు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు