మేట్లకు శిక్షణ.. పథకం అమలుపై అవగాహన

31-10-2026 | 06:26pm

బూర్గంపాడు,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను సమర్థవంతంగా చేపట్టడంతోపాటు వి.బి.-జి. రామ్‌జీ పథకం అమలులో మేట్లు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఏపీవో విజయలక్ష్మి సూచించారు. శనివారం బూర్గంపాడు మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్ మంద నాగరాజు అధ్యక్షతన మేట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

మోరంపల్లి బంజర, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, బూర్గంపాడు, టేకులచెరువు గ్రామపంచాయతీలకు చెందిన మేట్లకు పథకం అమలు, పనుల నిర్వహణపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనుల నాణ్యత, నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. 

మరిన్ని వార్తలు