జలసిరి కింద ఇంకుడు గుంతలు

24-10-2026 | 08:06pm

ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ 

లింగంపేట్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): గ్రామాల్లో ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని జలసిరి ద్వారా ఇంటింటికి ఇంకుడు గుంతలు(Percolation pits) తప్పనిసరిగా తవ్వించాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్(MPDO Praveen Kumar) అన్నారు. శనివారం లింగంపేట మండలంలోని కొండాపూర్ ,మంభుజిపేట, భవానిపేట్, జల్దిపల్లి గ్రామాలలో ఆయన సందర్శించారు. 

జిల్లా అధికారుల ఆదేశానుసారం రానున్న రోజుల్లో ఏదైనా ఎలినో ప్రభావంతో నీటి సమస్య తలెత్తకుండా గ్రామాల్లో నీటి తొట్టెలు పశువులకు దాహం తీర్చడానికి వాడుకోవాలని అదేవిధంగా గ్రామస్తులు వంట పాత్రలను ఇతర దరవస్తులను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలన్నారు. గ్రామాల్లో నీటి తొట్టిలను ఆయన పరిశీలించారు నీతి తొట్టిల్లో వారం వారం వాటిని బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేయాలని గ్రామ సర్పంచ్లకు కార్యదర్శిలకు సూచించారు. 

మీరు నిల్వ ఉన్న అట్లయితే నీతిలో పురుగుల ద్వారా దోమలు వ్యాపించి ప్రజలు రోగాల బారిన పడతారన్నారు. రోజువారీగా నీటి తోటిలను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. గ్రామాల్లో ఇంటింటికి ఇంకుడు గుంతను ఆ రాంజీ ఉపాధి కింద తగ్గించుకోవాలన్నారు. నీతి కొంత ద్వారా నీరు వృధా కాకుండా ఉంటాయన్నారు. ఉపాధి పనుల ద్వారా కూలీలకు పనులు కల్పించాలని ఈ సందర్భంగా  సూచించారు. వయా గ్రామ పంచాయతీల పరిధిలో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. 

జల్లిపల్లి గ్రామంలో మహిళా సంఘ భవనం నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. గ్రామ సచివాలయంలో గ్రామ సర్పంచ్ తెగుళ్ల సంగీత రమేష్ మొదటిసారిగా ఎంపీడీవో గ్రామ పంచాయతీకి రావడంతో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పకడ్బందీగా నిర్మాణం చేపట్టాలన్నారు. 

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇందిరమైనలు ఏ దశలో నిర్మాణం కొనసాగుతున్నయో పరిశీలించారు అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీలను తీర్చిదిద్దుకునే బాధ్యత సర్పంచులు పాల్గొన సభ్యులపైనే ఆధారపడింది అన్నారు. ఈయన వెంట  సర్పంచులు నర్సింలు, సురేందర్, కాశిరాం, సంగీత రమేష్, ఎంపీ ఓ మలహరి కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు