భజనలు మనిషిని ఆధ్యాత్మికత వైపు నడుపుతాయి

24-11-2026 | 11:19pm

ఎమ్మెల్యే 

బోథ్ నవంబర్ 23 (విజయక్రాంతి): బజార్హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమానికి మంగళవారం రాత్రి స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్(MLA Jadav Anil) హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేని గ్రామస్తులు సాదరంగా ఆహ్వానించారు అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలగడంతో పాటు గ్రామాలలో ఐక్యత భావం పెరుగుతుందన్నారు.

మనిషి ప్రతిరోజు తన దైనందిత కార్యక్రమాల్లో యంత్రంలాగా గడుపుతూ అలసిపోయి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దూరం అవుతున్నారన్నారు. అయితే భజన , భక్తి,అనేది ప్రతి మనిషి ఆచరించాలన్నారు. భక్తి భావన ఉంటే జీవితం లో మార్పు వస్తుందన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ భావితరాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి నేర్పించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో పలు గ్రామాల భక్తులు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు