ఐఆర్ఎస్ ట్రైనీ అధికారి జన్మదిన వేడుకలు

24-11-2026 | 10:45pm

బోథ్ నవంబర్ 23 (విజయక్రాంతి): గత నాలుగు రోజులుగా సోనాల మండల(Sonala mandal) కేంద్రంలో పర్యటిస్తున్న ట్రైనింగ్ ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు గ్రామీణ ప్రాంత ప్రజల జీవనశైలిని పరిశీలిస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించడంతోపాటు వారి వారి ఆచార వ్యవహారాలను నిషితంగా గమనిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండిస్తున్న పంటలు వారి జరుపుకునే పండుగలు ఈ ప్రాంతంలో పండే వివిధ రకాల పంటల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పరుస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజలకు చేరుతున్నాయా లేవా అధికారుల పనితీరు ఎలా ఉంది అనే విషయాలన్నీ అధికారులు గుర్తిస్తున్నారు. రోజంతా వివిధ కార్యక్రమాలలో బిజీగా ఉండే అధికారులు సమయం దొరికినప్పుడల్లా గ్రామీణ ప్రాంత ప్రజలతో మమేకమవుతున్నారు. 

ఘనంగా ఐఆర్ఎస్ అధికారి జన్మదిన వేడుకలు..

సోనాల మండలానికి వచ్చిన ట్రైన్ ఐఆర్ఎస్ అధికారి ప్రదీప్ జన్మదిన వేడుకలను సోనాల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి గ్రామ యువకులు ప్రజలు ఘనంగా నిర్వహించారు. భవిష్యత్తులో ఉన్నత అధికారులుగా విధులు నిర్వహించే వీరు ప్రజలతో కలిసి పల్లె జీవన విధానాన్ని అలవర్చుకుంటున్నారు.

కనీస వసతులు లేని గ్రామాలను పరిశీలించి మండల కేంద్రంలో ఉన్న వసతులను చూసి చైతన్యవంతులైన యువకుల మధ్యన అధికారి ప్రదీప్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అంతేగాక యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గుడాల అనీష్ జన్మదిన వేడుకలు ఏ రోజు కావడంతో అందరూ కలిసి ఒకే చోట జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇంటికి దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజల మధ్య జన్మదినం జరుపుకోవడం అధికారికి మరిచిపోలేని సంఘటనగా పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు