కార్తీక పౌర్ణమి సందర్భంగా JSPW ఆధ్వర్యంలో అన్నదానం

24-11-2026 | 10:40pm

ఖమ్మం టౌన్ నవంబర్ 24 (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జస్టిస్ ఫర్ సోషల్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ(Justice for Social and Public Welfare Society) ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 150 మందికి సాంబార్ రైస్, తాగునీటిని పంపిణీ చేశారు. JSPW వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దపాక రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో DCCB బ్యాంక్ మేనేజర్ పాముల మంగయ్య, రాజు మల్టీ కన్సల్టెన్సీ ప్రొప్రైటర్ టి. రాజు, మహమ్మద్ ఖాసిం బాబు పాల్గొన్నారు.  

అలాగే సంస్థ సభ్యులు వేముల సీతారామరావు, నామా వినోద్ కుమార్, పులిపాటి నరసింహారావు, మామిళ్లపల్లి నాగాచారి, గడ్డదాసు అప్పారావు, మురికిపూడి బాబూరావు, యర్రా నాగరాజారెడ్డి, బత్తుల గోపాలరావు, చెన్నబోయిన లక్ష్మీనారాయణ, మహమ్మద్ అజ్గర్, పెద్దపొంగు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, JSPW ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర శుభసందర్భాల్లో నిరుపేదలకు ఆహారం అందిస్తూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.

మరిన్ని వార్తలు