ఊకలో కూరుకుపోయి మహిళ మృతి

24-11-2026 | 11:23pm

సిద్దిపేట క్రైం, నవంబర్ 24: కల్లు తాగిన మత్తులో రైస్‌మిల్లు షెడ్డులో నిద్రించిన ఓ మహిళ ఊకలో కూరుకుపోయి ఊపిరాడక మృతి చెందిన ఘటన సిద్దిపేట(Siddipet)లో జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఊట్పల్లికి చెందిన బుడాల రాజమణి(52) అనే మహిళ కొన్ని రోజుల క్రితం సిద్దిపేలోని బారాహిమామ్ లో తన  కూతురు కూడేల్లి శైలజ  ఇంట్లో ఉంటోంది. కల్లుకు బానిసగా మారిన రాజమణి ఇంటి నుంచి వెళ్ళిపోయి రెండు, మూడు రోజులకోసారి తిరిగి వచ్చేది.

ఈ క్రమంలో ఈ నెల 22న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుండగా, 24న ఉదయం హనుమాన్ నగర్ శివారులోని జగదాంబ రైస్‌మిల్లు షెడ్డులో మృతదేహం కనిపించింది. భర్త మల్లేశం, కుమార్తె అక్కడికి చేరుకుని మృతదేహాన్ని రాజమణిగా గుర్తించారు. కల్లు మత్తులో షెడ్డులో నిద్రించి ఊకలో కూరుకుపోయి మృతి చెంది ఉంటుందని, తన భార్య మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని భర్త టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు