రసాయన గణపతిలువద్దు.. మట్టి గణపతలనే పూజిద్దాం
11-09-2026 | 05:33pm
బోథ్,(విజయక్రాంతి): రసాయనక గణపతి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని అందుకు మనం మట్టి గణపతులనే(clay ganeshas) పూజించాలని వేదం పాఠశాల ప్రిన్సిపల్ పచ్చిపాల సంతోష్ పిలుపునిచ్చారు. శుక్రవారం పాఠశాలలో విద్యార్థులకు మట్టి గణపతి వల్ల ఎలాంటి కాలుష్యం(Pollution) ఉండదని రసాయనిక గణపతి వల్ల నీటి కాలుష్యం జరిగి వాటిలో జీవించే జీవులు మృతి చెందుతాయని అన్నారు. పండుగ తో పాటు పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విద్యార్థుల వివరించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.