పార్టీ పటిష్టత కోసం పనిచేసే కార్యకర్తలకు గుర్తింపునిస్తాం

21-09-2026 | 03:40pm

బోథ్. సెప్టెంబర్ 21 ( విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ (Congress Party) పటిష్టత కోసం పనిచేసే కార్యకర్తలకు సరియైన గుర్తింపుని ఇస్తామని మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ సాహిద్ అలీ(Syed Shahid Ali) పేర్కొన్నారు. సోమవారం మైనార్టీ విభాగానికి చెందిన జాబితాను మండల మైనార్టీ నాయకులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పని చేసే వారిని గుర్తించి పదవులు ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు షేక్ అబుద్, షేక్ మహమ్మద్ ,అబ్రహార్, రహీముద్దీన్ ,అబ్దుల్ ,అలీమ్, షేక్ అమిరుద్దీన్ లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు