మట్టి దిబ్బే మృత్యు ఉచ్చుగా మారింది!

20-09-2026 | 08:05pm

టిప్పర్ చక్రాల కింద పడి ఇద్దరు మృతి 

జవహర్ నగర్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): జవహర్ నగర్ పోలీస్ స్టేషన్(Jawahar Nagar Police Station) పరిధిలో గల ఎల్లారెడ్డిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. రాయల్ ఇరానీ కేఫ్ సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు(Inspector Saidulu) తెలిపిన వివరాల ప్రకారం మార్తల వెంకట దీప్తిక రెడ్డి (21), గంధం అమర్త్య(15) ఆక్టివా స్కూటీపై వెళ్తుండగా రోడ్డుపై ఉన్న మట్టి దిబ్బను తప్పించుకునే క్రమంలో స్కూటీ అదుపుతప్పి స్కిడ్ అయింది.

అదే సమయంలో వెనుక నుంచి మట్టితో వస్తున్న టిప్పర్‌ కింద ఇద్దరూ పడిపోయారు. టిప్పర్ వెనుక చక్రాలు దీప్తికపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో అమర్త్య కూడా మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ బాలాజీనగర్‌కు చెందిన గుంజ నరసింహ(28)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు