జి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు...
- జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి గడుల శ్రీనివాసరావు...
- అక్టోబర్ 10 నుంచి 18 వరకు వేడుకలు...
- ఉత్తమ బతుకమ్మకు ప్రతిరోజూ పట్టుచీర....
- ప్రతి నలుగురికి ప్రోత్సాహక బహుమతులు...
కొత్తగూడెం అక్టోబర్ 8 విజయ క్రాంతి : తెలంగాణ సంస్కృతి(Telangana Culture), సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను, ఈ ఏడాది కొత్తగూడెంలో తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు డా. జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్(Dr. GSR Charitable Trust) ప్రకటించింది. గత ఐదేళ్లుగా కొత్తగూడెం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలను, ఈ ఏడాది మరింత విస్తృతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అక్టోబర్ 10, శనివారం నుంచి అక్టోబర్ 18, ఆదివారం వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి కొత్తగూడెం విద్యానగర్ కాలనీలోని,జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు.
ఈ వేడుకల్లో డా. జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ డా. గడల శ్రీనివాసరావు పాల్గొననున్నారు.
వేడుకల్లో భాగంగా ప్రతిరోజూ అత్యుత్తమంగా అలంకరించిన బతుకమ్మకు పట్టుచీరను, ప్రథమ బహుమతిగా, మరో నలుగురు మహిళలకు ప్రోత్సాహక బహుమతులను అందజేయనున్నారు.
బతుకమ్మ అంటే కేవలం పండుగ కాదు… తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, మన సంస్కృతికి నిలువెత్తు ప్రతీక. ఈ వేడుకల్లో కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని కోరుతున్నారు.
10 వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి జనసేన పార్టీ జిల్లా కార్యాలయం, హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ లైన్, విద్యానగర్ కాలనీ, కొత్తగూడెంలో నిర్వహించబడును. ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకై సంప్రదించవలసిన నంబర్: 9701048341...