రక్తదాతలుగా టియూడబ్ల్యూజే జర్నలిస్ట్ లు
08-10-2026 | 08:53pm
కన్నాయిగూడెం, అక్టోబర్ 08(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని రైతు వేదికలో గురువారం రోజున ముప్పనపల్లి సహాయనిధి(Muppanapalli Relief Fund) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదాతలుగా మారిన తెలంగాణ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ, IJU) (Telangana Union of Working Journalists)సంఘ నాయకులు కావిరి చిరంజీవి, పంతంగి నాగరాజు, వాసంపల్లి రమేష్, మరికాల వెంకటేష్.
ప్రజా సమస్యలను కథనాల రూపంలో ప్రచురించి సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లే వర్కింగ్ జర్నలిస్ట్ లు సమాజసేవలో సైతం ముందు ఉండటం సంతోషకరమైన విషయమని పలువురు కొనియాడారు.