గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రమాద బీమాపై అవగాహన
01-10-2026 | 02:28pm
టేకులపల్లి, (విజయక్రాంతి): మండలంలోని గ్రామ పంచాయతీ సిబ్బందికి(Gram Panchayat staff) ప్రమాద బీమా భద్రత కల్పించే ఉద్దేశంతో టేకులపల్లి ఎంపీడీవో శ్రీదేవి ఆధ్వర్యంలో గురువారం GAG Accidental Insuranceపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో సులానగర్ బీవో పరిధిలోని ముత్యాలంపాడు ఎక్స్‌రోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పోస్టల్ శాఖ అధికారులు బీమా పాలసీ ప్రయోజనాలు, నమోదు విధానం, ఇతర వివరాలను సిబ్బందికి వివరించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ప్రమాద బీమా పాలసీలు పొందేందుకు ముందుకు వచ్చారు. కార్యక్రమంలో IPO ఇల్లందు యాకయ్య, IPPB మేనేజర్ శరత్ చంద్ర, ఎంవో అబ్దుల్‌తో పాటు పోస్టుమాస్టర్లు శ్రీరాములు, హసీం, శ్రీను, బాబురావు, రాగసుధ, హర్షిత, మహేష్, శివ, నరేందర్ పాల్గొన్నారు.