అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్

26-10-2026 | 07:54pm

ముకరంపుర, అక్టోబర్ 26 (విజయక్రాంతి): నగర అభివృద్ధే ద్యేయంగా మా పాలకవర్గం పని చేస్తుందని మేయర్ కొలగాని శ్రీనివాస్(Mayor Kolagani Srinivas) అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా సోమవారం 1,2,32,33 డివిజన్లలో  మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటించారు.

మొదటగా 2 వ డివిజన్ తీగలగుట్టపల్లి లో నగరపాలక సంస్థకు చెందిన 11 లక్షల సాధారణ నిధులతో ఎస్ డబ్లుజీ పైపులైన్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమీ పూజ చేశారు. అనంతరం 32 వ డివిజన్ హుస్సెన్ పురలో స్థానిక కార్పోరేటర్ షేక్ యూసూఫ్ తో కలిసి 20 లక్షల యూఐడీఎఫ్ నిధులతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభించారు.

34వ డివిజన్ హుస్సెన్ పురలో స్థానిక కార్పోరేటర్ సమీనా పర్వీన్ తో కలిసి యూఐడీఎఫ్ కు చెందిన 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమీ పూజ చేశారు. అనంతరం 1 వ డివిజన్ ఆరెపల్లి లో స్థానిక కార్పోరేటర్ బారి అపర్ణ జితేంధర్ తో కలిసి నగరపాలక సంస్థ కు చెందిన 27 లక్షల సాధారణ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభించారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు.

పనులు ప్రారంభోత్సవాలు చేసి.... పనులు స్టాట్ చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం సంబందిత డివిజన్ల లో  ప్రజలు దృష్టికి తెచ్చిన సమస్యలను తనిఖీ చేసి పరిశీలించారు.  ఒక వైపు నగరం మరో వైపు విలీన శివారు 32 వ డివిజన్ హుస్సెన్ పుర ప్రాంతంలో మరో 30 లక్షల నిధుల కు సంబంధించిన పనులను కూడ త్వరలోనే ప్రారంభం చేస్తామని తెలిపారు. 34 వ డివిజన్ అభివృద్ధి కి కూడ యూఐడిఎఫ్ కింద ఇప్పటికే నిధులు కేటాయించి పనులు ప్రారంభం చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, అధికారులు, స్థానిక డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు