పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించిన పోలీసులు

06-10-2026 | 12:03am

బాధితులకు అందించిన భద్రాచలం డిఎస్పి యం.అరుణ్ కుమార్

భద్రాచలం (విజయక్రాంతి): గత కొంత కాలంగా భద్రాచలం(Bhadrachalam) టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సందర్భాల్లో మొబైల్ ఫోన్లు పోయినట్లుగా ఫిర్యాదులు రాగా, వచ్చిన పిర్యాదుల మేరకు CEIR పోర్టల్ లో నమోదు చేసి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోయిన 32 ఫోన్ లను భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్ చేతుల మీదుగా బాధితులకు అందించారు.

మొబైల్ ఫోన్లు పోగొట్టుకోవడం లేదా చోరీకి గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ప్రజలు రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, బస్సులు, రైల్వే స్టేషన్లు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ ఫోన్లను ఉపయోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లను నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ ఉంచరాదని, మొబైల్ ఫోన్లు పోయిన లేదా చోరీకి గురైన సమాచారాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించి, మొబైల్ ఫోన్ IMEI నంబర్ మరియు ఇతర వివరాలను పోలీసులకు అందించాలని ఈ సందర్బంగా డీఎస్పీ యం.అరుణ్ కుమార్ గారు తెలిపారు.

మరిన్ని వార్తలు