సోమక్క కుటుంబానికి 50 కేజీల బియ్యం కాంగ్రెస్ నాయకులు అందజేత
05-10-2026 | 11:57pm
తుంగతుర్తి (విజయక్రాంతి): ఏఐసీసీ సభ్యులు నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి(Ram Reddy Sarvottam Reddy) ఆదేశానుసారం తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన మట్టిపెల్లి సోమ్మక్క గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. తుంగతుర్తి గ్రామపంచాయతీ 2వ, వార్డు మెంబర్ ఎల్లబోయిన శ్రీకాంత్ నాయుడు ఆధ్వర్యంలో, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కటకం వెంకటేశ్వర్లు,గునిగంటి రమేష,తూము వెంకట్ తదితరులు పాల్గొన్నారు...