ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యకర్తల సమావేశం

06-10-2026 | 12:01am

మహమ్మదాబాద్, (విజయక్రాంతి): మండల పరిధిలోని దేశాయిపల్లి (నంచర్లగేట్)చౌరస్తాలో బీజేపీ మండల అధ్యక్షుడు మూస నరసింహ(Musa Narasimha) ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేశారు. కార్యక్రమానికి శంకర్నాయక్, ప్రభునాయక్, కుర్వకృష్ణ, తిరుపతిరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకునేలా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు. పట్టభద్రుల ఓటరు నమోదుకు సంబంధించిన ఫారమ్-18ను అర్హులైన వారితో పూర్తి చేయించి, ఓటరు జాబితాలో పేర్లు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సేవజ్యోతి’ సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో మరింత విస్తృతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు