జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం

30-10-2026 | 12:01am

ప్రజాస్వామ్య విలువలను కాలరాసే హక్కు ఎవ్వరికీ లేదు

ఓటు చోరీ క్షమించరాని నేరం

నవంబర్ 1న ఛలో ఢిల్లీ

జిల్లా నుండి 120 మంది

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్  పాషా 

కొత్తగూడెం టౌన్,(విజయక్రాంతి): ప్రజాపక్షం/భద్రాద్రి కొత్తగూడెం: ఓటు చోరీ క్షమించరాని నేరమని, ప్రజాస్వామ్య విలువలను కాలరాసే హక్కు ఎవ్వరికీ లేదని, ఎన్నికల వ్యవస్థను బ్రష్టు పట్టించిన ఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం సాగిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాష స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైధానంలో నిర్వహించే ర్యాలీ నిరసన కార్యక్రమానికి జిల్లా నుండి 120 మందితో కూడిన సిపిఐ ప్రతినిధి బృంధం తరలుతుందని చెప్పారు.

ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ఓటు హక్కు పరిరక్షణ కోసం రాజీలేని పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అత్యంత కీలకమని, ప్రజా తీర్పును గౌరవించడం ప్రతీ వ్యవస్థ బాధ్యతన్నారు. ఓటు చోరీకి సంబంధించి విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా ఎన్నికల సంఘం వ్యవహరించాలన్నారు.

ఎన్నికల సంఘం పనితీరుపై సుప్రీం కోర్టు ఇప్పటికే మొట్టికాయ మొట్టిందని, న్యాయస్థానాల సూచనలను పరిగణలోనికి తీసుకుని ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచాలన్నారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం వామపక్ష శ్రేణులు ప్రజాసంఘాలు ఐ ఖ్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు రక్షణ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ ఎన్నికల వ్యవస్థలో జవాబుదారీతనం కోసం తమ పోరాటం కొనసాగిస్తామని పాపా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు