పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో(Police Commemoration Week) భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో ఉచిత వైద్య శిబిరం(Free Medical Camp) నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్స్ సహకారంతో గురువారం అస్త్ర కన్వెన్షన్లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం(Commissioner Goush Alam) పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ శిబిరంలో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, స్థానికులకు బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో తదితర పరీక్షలు నిర్వహించి, వివిధ విభాగాల వైద్య నిపుణులు ఉచితంగా వైద్య సలహాలు అందించారు.
కార్డియాలజిస్ట్ డా. ఆర్. సతీష్ కుమార్, గైనకాలజిస్ట్ డా. ఆర్. గౌరి లక్ష్మి, జనరల్ ఫిజీషియన్ డా. ఆర్. నాగరాజు, ఆర్థోపెడిషియన్ డా. సి. వేణుగోపాల్, జనరల్ సర్జన్ డా. అబ్దుల్ వారిస్ ఉస్మానీ, డైటీషియన్ జె. మమత, ఫిజియోథెరపిస్ట్ దౌలతాబాజీ అనిల్ తదితరులు వైద్య సేవలు అందించారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ, సంక్షేమానికి ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు.