పారాచూట్ ‘ఫీల్ లైక్ ఎ గర్ల్ అగైన్’ నినాదం

29-10-2026 | 11:43pm

హైదరాబాద్: పొడవాటి జడలు, స్నేహితులతో అంతులేని నవ్వులు, చిన్న చిన్న ఆటలు ఎంతో ఆనందాన్నిచ్చిన ఆ నిర్భయపు బాల్యపు రోజులు గుర్తున్నాయా? పెరిగి పెద్దయ్యేకొద్దీ కొత్త బాధ్యతలు వచ్చినా, ప్రతి స్త్రీలోని చిన్నారి ఎప్పటికీ పూర్తిగా మాయం కాదు. ఎంతో మంది మహిళలు తమ బాల్యంతో ముడిపెట్టుకునే ఆనందం, స్వేచ్ఛ, స్నేహాన్ని వేడుక చేసుకుంటూ, ఈ మధుర జ్ఞాపకాలను పురస్కరించుకుని, ‘ఫీల్ లైక్ ఎ గర్ల్ అగైన్’ అనే హృద్యమైన కొత్త బ్రాండ్ ప్రచారాన్ని పారాచూట్ అడ్వాన్స్‌డ్ గోల్డ్(Parachute Advanced Gold) కోకోనట్ హెయిర్ ఆయిల్ ఆవిష్కరించింది.

ఈ ప్రచారంపై మారిగో లిమిటెడ్, ఇండియా సీఎంఓ విక్రమ్ కర్వాల్ వ్యాఖ్యానిస్తూ, ‘‘నేటి వినియోగదారులు తమ అవసరాలను మాత్రమే కాకుండా, వారి జీవితాలను తీర్చిదిద్దే భావోద్వేగాలను, జ్ఞాపకాలను కూడా అర్థం చేసు కునే బ్రాండ్‌ల కోసం చూస్తున్నారు. పొడవాటి జుట్టు తరచుగా బాల్యంలోని మధురమైన జ్ఞాపకాలతో ఒక బల మైన అనుబంధంగా పనిచేస్తుందనే దృక్పథం ఆధారంగా ‘ఫీల్ లైక్ ఎ గర్ల్ అగైన్’ రూపొందించబడింది.

ఈ ప్రచారం ద్వారా, అందమైన పొడవాటి జుట్టు ప్రేరేపించగల ఆత్మవిశ్వాసం, సౌందర్యం, స్వేచ్ఛకు జీవం పోసేందుకు, సాంస్కృతికంగా ప్రతిధ్వనించే ఒక కథను ఉపయోగించి ఆ భావోద్వేగ బంధాన్ని మేం వేడుకగా చేసుకుంటు న్నాం. బ్రాండ్ ప్రధాన వాగ్దానానికి కట్టుబడి ఉంటూనే, వినియోగదారులతో గాఢంగా అనుసంధానం అయ్యే అర్థవంతమైన కథలను రూపొందించడంపై మా నిరంతర దృష్టిని ఈ ప్రచారం ప్రతిబింబిస్తుంది” అని అన్నారు.

ఈ సినిమాటిక్ వేడుకకు ప్రధాన ఆకర్షణ గౌతమ్ వాసుదేవ్ మీనన్. తనదైన ముద్రతో కూడిన కథాంశాలు, మహిళల పాత్రలను తీర్చిదిద్దే చిరస్మరణీయ శైలితో ఆయన దక్షిణ భారత సినిమాలో అత్యంత ఆదరణ పొందిన దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఈ క్యాంపెయిన్‌కి (ప్రచార చిత్రానికి) తన ప్రత్యేకమైన భావోద్వేగ స్పర్శను జోడిస్తూ, గౌతమ్ ముగ్గురు స్నేహితుల కథను ఆవిష్కరించారు. తమ దైనందిన జీవితాల నుంచి కాస్త విరామం తీసుకొని, తీరప్రాంతంలో స్వేచ్ఛగా పరిగెడుతూ, డాన్స్ చేస్తూ, ఆడుకుంటూ, ఊగుతున్న తమ పొడవైన జడలతో వారు తమ చిన్ననాటి సంతోషాలను మళ్లీ అనుభవించే దృశ్యాలను ఆయన ఇందులో ఎంతో అందంగా మలచారు.

మరిన్ని వార్తలు