ఉద్యోగం పేరుతో మోసం

30-10-2026 | 12:10am

కూకట్ పల్లి,(విజయక్రాంతి): విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి రూ.2 లక్షల 42 వేలు వసూలు చేసి అనంతరం మలేషియాకు పంపి మోసానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న కేపిహెచ్ బి పోలీస్ లు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గుంటూరు జిల్లా నాయుడుపేటకు చెందిన నరేడ్ల బాల గంగాధర్ రావుకు ఇన్స్టా గ్రామ్ ద్వారా బల్లె నరేష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కెపిహెచ్బి కాలనీలోని మంజీరా ట్రినిటీలో 'బెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్' పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నట్లు పరిచయం చేసుకున్న నరేష్, మలేషియాలో డేటా ఎంట్రీ సూపర్వైజర్ ఉద్యోగం(Data Entry Supervisor Job) ఇప్పిస్తానని హామీ బాలగంగాధర్ రావుకు నరేష్ హామీ ఇచ్చాడు.

ఈ క్రమంలో అక్టోబర్ 2న కన్సల్టెన్సీ కార్యాలయంలో నరేష్ తోపాటు అక్కడ పని చేస్తున్నా జగవీరా పిల్లెల అనే మరో వ్యక్తి తన నుంచి రూ. 2 లక్షల 42 వేల రూపాయలు వసూలు చేశారని, తన స్టడీ సర్టిఫికెట్లను కూడా తీసుకొని ఒప్పందం చేసుకున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి హామీని నమ్మి అక్టోబర్ 12న మలేషియాకు వెళ్లిన తనకు ఎవరు స్వాగతం పలకలేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అనంతరం ఓ ఏజెంటు ఫోన్ చేసి సింగపూర్  సమీపంలోని గుర్తుతెలియని ప్రాంతం వెళ్లాలని సూచించడంతోపాటు తన పాస్పోర్ట్ను కూడా తీసుకున్నట్టు ఆరోపించారు. ఉద్యోగం గురించి అడిగితే మరి కొంత సమయం పడుతుంది కాలయాపన చేసినట్లు ఆరోపించాడు. తాను మోసపోయినట్లు గ్రహించి స్వ దేశానికి తిరిగి రావాలనుకోగా, తిరిగి రావడానికి అదనంగా మరో రూ. 3 లక్షలు అదనంగా చెల్లించాలని బెదిరించారని, తన పాస్ పోర్ట్ ను తిరిగి ఇవ్వడానికి నిరాకరించారని బాధితుడు ఆరోపించాడు. ఫిర్యాదు స్వీకరించిన కేపీహెచ్బీ పోలీసులు గురువారం నరేష్ తో పాటు జగవీరా ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు