ఓటరు నమోదు ఫారాలు సమర్పించిన బీఆర్ఎస్

29-10-2026 | 11:42pm

శ్రీరంగాపురం: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections)కు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా శ్రీరంగాపురం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చురుకుగా పాల్గొన్నారు. గురువారం బీఆర్ఎస్(BRS) మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అర్హులైన పట్టభద్రుల ఓటరు నమోదు(Graduate voter registration) కోసం సేకరించిన దరఖాస్తు ఫారాలను శ్రీరంగాపురం ఎంఆర్ఓ కార్యాలయంలో సమర్పించారు.

పట్టభద్రులు(Graduates) తమ ఓటు హక్కును నమోదు చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆర్. వెంకటస్వామి, సీనియర్ నాయకులు పృథ్వీరాజ్, సాహితీ కళా వేదిక అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్, నగరాల మాజీ సర్పంచ్ రాధాకృష్ణ, మైనారిటీ నాయకుడు ఎండీ షఫీ, మండల సోషల్ మీడియా కన్వీనర్ పర్వతాలు, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, బొక్కలయ్య, మాజీ వార్డు సభ్యుడు సంపత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు