ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి

31-10-2026 | 07:25pm

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

బూర్గంపాడు,(విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు(MLC Voter Registration)లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు(Ex-MLA Raga Kantha Rao) సూచించారు. శనివారం బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, బూర్గంపాడులో నిర్వహించిన ఓటరు నమోదు సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పరిసర ప్రాంతాల్లోని అర్హులను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని కోరారు. ఓటరు నమోదుకు అవసరమైన ధ్రువపత్రాలను సేకరించి, ఫారం-18తో జతచేసి సంబంధిత నమోదు కేంద్రాల్లో అందించాలని సూచించారు. నవంబర్ 6 చివరి తేదీ కావడంతో గడువుకు ముందే అర్హులందరి పేర్లు నమోదు చేయించే బాధ్యతను పార్టీ శ్రేణులు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఎన్నికల ఇన్‌ఛార్జి దిండిగల రాజేందర్, మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, నాగినేని ప్రోలో రెడ్డిపాలెం సర్పంచ్ బానోత్ సరోజ,మాజీ సర్పంచ్ సిరిపురపు స్వప్న, నాయకులు గోపిరెడ్డి రమణారెడ్డి,మేడగం లక్ష్మీనారాయణ రెడ్డి, గోనెల నాని,మాజీ వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల, అనుబంధ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు