ఇంటింటికి ఇంకుడు గుంత అవసరం
13-10-2026 | 05:10pm
బోథ్ (విజయక్రాంతి): ప్రతి ఇంటికి ఇంకుడు గుంత అవసరమని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు(MPDO Ratnakar Rao) పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని దేవుల నాయక్ తండ సాకేర గ్రామాలలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో నీటి ఎద్దడి లేకుండా ఉండాలంటే ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నీటి వృధాను విద్యుత్ వృధాను అరికట్టాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు.