ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరసన

13-10-2026 | 05:09pm

నిర్మల్ అక్టోబర్ 13 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ లో (National Health Mission)పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం వైద్య ఉద్యోగులు నిరసన బాట పట్టారు. వైద్య ఆరోగ్యశాఖ ఆయుష్(Health Ministry AYUSH) తదితర శాఖలో పనిచేసే ఉద్యోగులు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీవో కార్యాలయం ముందు సమ్మె ప్రారంభించారు.

ఉద్యోగ భద్రత కల్పించాలని వేతనంతో కూడిన సెలవులు అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని వసతులు కల్పించాలని చనిపోయిన ఉద్యోగ కుటుంబానికి 20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గంగాధర్ శోభ రమణ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు