ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ములకలపల్లి,(విజయక్రాంతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సారథ్యంలో ప్రభుత్వ పాలన కొనసాగుతుందని జగన్నాధపురం సర్పంచి కుంజా వినోద్ అన్నారు. ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం సర్పంచ్ కుంజా వినోద్ ను ఇందిరమ్మ ఇళ్ల(Indiramma housing scheme) లబ్ధిదారులు కలిశారు.
వారు మాట్లాడుతూ... పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.సొంత ఇల్లు ప్రతి పేద కుటుంబానికి ఎంతో ముఖ్యమని, ఇల్లు కల్పించడం ద్వారా పేదలకు భరోసా, ఆత్మగౌరవం లభిస్తాయని వారు పేర్కొన్నారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని లబ్ధిదారులు ఆకాంక్షించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలని వారు కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుంజా వినోద్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి చివర బిల్లుకు కావలసినటువంటి వివరాలను లబ్ధిదారుల నుండి తీసుకోవాలని సెక్రటరీ సునీష్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండల కాంగ్రెస్ బి యల్ ఎ కోఆర్డినేటర్ సురభి రాజేష్,యన్ యస్ యు ఐ మండల అధ్యక్షుడు గుంట్రు సాయి పంచాయతీ సూపర్ వైజర్ మరీదు రాం సురేష్ పాల్గొన్నారు.