పేదలకు నూతన వస్త్రాల పంపిణీ

17-10-2026 | 09:37pm

అంతర్జాతీయ పేదల నిర్మూలన దినోత్సవం

కోదాడ, అక్టోబర్ 17:(విజయక్రాంతి) : అంతర్జాతీయ పేదల నిర్మూలన దినోత్సవాన్ని(International Day for the Eradication of Poverty) పురస్కరించుకుని కోదాడ నయా నగర్ బాప్టిస్ట్ చర్చి(Kodad Naya Nagar Baptist Church) ఆవరణలో పేదలకు నూతన వస్త్రాల పంపిణీ కార్యకమము(Distribution of New Clothes Program) శనివారం నిర్వహించారు. కోదాడ మున్సిపాలిటీ మాజీ క్రిస్టియన్ కో-ఆప్షన్ సభ్యురాలు శ్రీమతి వంటేపాక జానకి యేసయ్య ఆధ్వర్యంలో కొంతమంది నిరుపేదలకు నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, పేదరిక నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా పేదలకు సహాయం చేయాలని, పేదలను ఆదుకోవడమే నిజమైన దైవ సేవ అని పేర్కొన్నారు.

పేదల పట్ల ప్రేమ, సహాయం చూపడం ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ నాయకులు పాస్టర్ యేసయ్య, పాస్టర్ కర్ల ప్రభుదాస్, డేవిడ్ రాజారావు, పాస్టర్ రాజారావు, పాస్టర్ కాపుగంటి ప్రసాదరావు, పాస్టర్ చెల్మయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు