ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
ధర్నా చేస్తున్న ఉద్యోగులకు మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే
నల్గొండటౌన్ : అక్టోబర్ 17 : వైద్య శాఖలో(Medical Department) విధులు నిర్వహిస్తున్న ఎన్ హెచ్ ఉద్యోగులను(NH employees) రెగ్యులర్ చేయాలని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Former Nalgonda MLA Kancharla Bhupal Reddy) అన్నారు. శనివారం ఐదో రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న ఎన్. హెచ్. ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులకు మద్దతు తెలిపి మాట్లాడారు. తెలిపారు.
ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలి. ప్రజలకు సేవలు అందిస్తున్న వీరికి పని భారం కొండంత, వచ్చే జీతం గోరంతఅన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అంగన్వాడీ, ఆశా వర్కర్ల వేతనాలు పెంచి జీవితాలు నిలబెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లైనా హామీలు నిలబెట్టుకోలేదు.
బి ఆర్ ఎస్ పార్టీగా మా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ అధ్యక్షుడు రేగట్టే మల్లికార్జున రెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు లొడంగి గోవర్ధన్, మాజీ సర్పంచ్ కోట్ల జయపాల్ రెడ్డి, కోట్ల అశోక్ రెడ్డి, సంఘ నాయకులు పాల్గొన్నారు.