మీడియా సమాజానికి దిక్సూచి లాంటిది

18-10-2026 | 05:21pm

కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కల్పనా చౌదరి 

పాల్వంచ, అక్టోబర్ 18, (విజయక్రాంతి): మీడియా సమాజానికి దిక్సూచి లాంటిదని, ప్రభుత్వాలకు ప్రజలకు వారది లాంటిదని కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కల్పనా చౌదరి(Kalpana Chowdary, Chairperson of Kolli Foundation) అన్నారు. ఆదివారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసిన వారు జర్నలిస్టుల(Journalists) కోసం పదివేల రూపాయల విలువైన జర్నలిజం పుస్తకాలను బహుకరించారు. అదేవిధంగా తమవంతుగా ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం రూ.10,016 లు నగదును విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా కల్పనా చౌదరి  మాట్లాడుతూ  తాను పుట్టి పెరిగిన పాల్వంచ పరిసర ప్రాంతాలను విద్య ,వైద్య రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రత్యుపకారం ఆశించకుండా సమాజ సేవ చేస్తున్న కొల్లి ఫౌండేషన్ కు తమవంతుగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాలలో భాగస్వాములము  అవుతామ ని తెలిపారు.

కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, కొల్లి  ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు