ఉరి వేసుకొని యువకుని ఆత్మహత్య
కాగజ్ నగర్ ,అక్టోబర్ 18 ( విజయక్రాంతి) : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) కాగజ్ నగర్ మండలంలోని కోసిని గ్రామపంచాయతీ(Kosini Gram Panchayat) పరిధిలో ఆదివారం గుర్తుతెలియని యువకుడు(30) చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగజ్ నగర్--సిర్పూర్ టి ప్రధాన రహదారి పక్కన తుమ్మ చెట్టుకు ఉరి(Hanging) వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉండే యువకులు చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయిన వ్యక్తి గురించి కాగజ్ నగర్ రూరల్ పోలీసులకు(Kagaznagar Rural Police) సమాచారం అందించారు.
దీంతో కాగజ్ నగర్ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని యువకుని మృతి కి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవని సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు .మృతి చెందిన యువకునికి పోస్టుమార్టం నిర్వహించేందుకు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ సందీప్ కుమార్ వివరించారు.