తక్కువ తూకంతో సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు
జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి కూచన మనోహర్
బియ్యం, కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై 6 కేసులు నమోదు
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 6, (విజయక్రాంతి): వినియోగదారులకు సరుకులను నిర్ణీత తూకం(Specified weight) కంటే తక్కువగా విక్రయిస్తూ మోసాలకు పాల్పడే వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు(Strict action as per the law) తీసుకుంటామని జిల్లా తూనికలు, కొలతల శాఖ(Department of Weights and Measures) అధికారి కూచన మనోహర్ హెచ్చరించారు. సివిల్ సప్లై కమిషనర్(Commissioner of Civil Supplies) శ్రీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని(Kothagudem town) బాబుక్యాంప్, పెద్దబజార్ ప్రాంతాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు బియ్యం దుకాణాలు, కిరాణా, జనరల్ స్టోర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బియ్యం బస్తాలను తూకం వేయగా, 26 కిలోలుగా పేర్కొన్న బస్తాల్లో కేవలం 25 కిలోల బియ్యం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారులపై మొత్తం 6 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి వ్యాపారి ప్యాకింగ్ చేసిన సరుకులపై నికర బరువును స్పష్టంగా ముద్రించాలని, ప్రకటించిన బరువుకు అనుగుణంగానే వినియోగదారులకు సరుకులు విక్రయించాలని సూచించారు. బస్తాలపై పేర్కొన్న బరువు కంటే తక్కువగా సరుకులు విక్రయించినా, తూనికలు, కొలతల నిబంధనలను ఉల్లంఘించినా సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వినియోగదారులు సైతం సరుకులు కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్లపై ముద్రించిన నికర బరువును, తూకాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.
వ్యాపారులు నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా వ్యాపారం నిర్వహించాలని, వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి తెలిపారు.