ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పారదర్శకత పాటించాలి

06-11-2026 | 07:28pm

సిపిఎం

రాజకీయ జోక్యానికి తావు ఉండకూడదు

అర్హులైన, పేదలకు న్యాయం చేయాలి

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 6, (విజయక్రాంతి) : రెండో విడత ఇందిరమ్మ, ఇళ్ల పథకం(Indiramma Housing Scheme) కింద లబ్ధిదారుల(Beneficiaries) ఎంపిక ప్రక్రియలో, పూర్తి పారదర్శకతను పాటించాలని, రాజకీయ జోక్యానికి ,ఏమాత్రం తావు లేకుండా ,అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు, మంజూరు చేయాలని, సిపిఎం పార్టీ(CPM Party) జిల్లా కార్యదర్శి, బి రెడ్డి సాంబశివ రాష్ట్ర ప్రభుత్వాన్ని ,ఆయన డిమాండ్ చేశారు .శుక్రవారం నాడు తోట నాగేశ్వరరావు, అధ్యక్షులు జరిగిన మండల కమిటీ, సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ,సొంత ఇంటి కల లక్ష్యంతో, అమలు చేస్తున్న ,ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజమైన పేదల పొందాలని, కానీ లబ్ధిదారుల ఎంపికలో, అధికార పార్టీ రాజకీయ పలుకుబడి, సిఫార్సులు, ఆర్థిక ప్రభావాలకు, ప్రాధాన్య కల్పిస్తూ అర్హులైన, పేదలకు అన్యాయం ,చేస్తున్నారని ఆరోపించారు, కాబట్టి అధికారులు గ్రామస్థాయిలో, సమగ్రత విచారణ చేపట్టి ఇల్లు, లేని నిరుపేద కుటుంబాలు, నిరుపేద కూలీలకు , ప్రాధాన్యత కల్పిస్తూ ఎంపిక చేసిన ,లబ్ధిదారుల జాబితాలు గ్రామపంచాయతీ ,కార్యాలయంలో బహిరంగ ప్రదర్శించాలని, ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల, కార్యదర్శి గ్యానం వాసు, మండల కమిటీ సభ్యులు, వంకా రాములు, సర్పంచ్ కొరసా నరసింహారావు, కాపుల వెంకటేశ్వర్లు, కృష్ణ, జి కృష్ణ, ఇర్ఫా శీను కంఠం సత్యం, బొగ్గుల నారాయణ, బాడ్సమ్మయ్య ,కుంజా నారాయణ, సుహాసిని, నిర్మల, తిరుపతమ్మ తదితరులు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు