లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు
మఠంపల్లి నవంబర్ 06 (విజయక్రాంతి): మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం(Lakshmi Narasimha Swamy Temple)లో శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అధికారులు, ధర్మకర్తలు, గ్రామ ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. జూలై 29, 2026 నుంచి నవంబర్ 6, 2026 వరకు మొత్తం 98 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని లెక్కించగా, సాధారణ హుండీ ద్వారా రూ.12,18,386 ఆదాయం సమకూరింది.
న్నదానం హుండీ ద్వారా రూ.76,000 లభించగా, మొత్తం రూ.12,94,386 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు, విజయకుమార్, కార్యనిర్వహణాధికారి టి.వెంకటచలపతి, మట్టపల్లి గ్రామ సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, దేవాదాయ శాఖ పర్యవేక్షకులు డి.శేషగిరి తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్రీ సాయి సేవా సంఘానికి చెందిన సుమారు 70 మంది సభ్యులతో పాటు దేవస్థాన అర్చకులు, సిబ్బంది, భక్తులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.