అమరవీరుల సంస్మరణ కరపత్రం ఆవిష్కరణ

02-11-2026 | 12:07am

ములకలపల్లి, నవంబరు 1 (విజయక్రాంతి): సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) ఆధ్వర్యంలో నవంబర్ 1 నుండి 7వ తేదీ వరకు జరగనున్న అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ములకలపల్లి మండలం జగన్నాధపురంలో శనివారం అమరవీరుల సంస్మరణ కరపత్రాన్ని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ సభ్యులు కల్లూరు కిషోర్(Kalluru Kishore), పోతుగంటి లక్ష్మణ్ కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ నవంబర్ 1 నుండి 7 వరకు అమరవీరులను,వారి త్యాగాలను, లక్ష్యాలను స్మరిస్తూ సభలు జరపాలని నిర్ణయించిందని తెలిపారు.గ్రామ గ్రామాన సభలు, ప్రదర్శనలు జరపాలని కోరారు. నేడు సమాజం వేగంగా అభివృద్ధి చెందుతున్నా,సైన్స్,సాంకేతికత, సంపద విపరీతంగా పెరిగినా,అవి అతి కొద్ది మంది చేతిలోనే పోగుబడి ఉన్నాయని  అసమానతలు, అంతరాలు పెరిగాయని చెప్పారు.

నిరుద్యోగం,అధిక ధరలు,భద్రత లేని ఉద్యోగాలతో తీవ్ర అసంతృప్తి రాజుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.80 ఏండ్లుగా పేదల పేరు చెప్పి ధనికులకు కొమ్ముకాస్తున్న పాలక వర్గాలు,దేశ సంపదను,ప్రజా వనరులను దేశ,విదేశీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నాయని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ మౌలిక వనరులైన ఆయిల్, ఖనిజాలు,విమానాశ్రయాల,రైల్వేలు,ఇన్సూరెన్స్, ఎల్.ఐ సి,బ్యాంకులను, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అదానీ, అంబానీలకు కట్టబెడుతోందని బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ దేశంలో మతోన్మాదం, మూఢభక్తి, సనాతన ఆచారాల పేరుతో ప్రజల సమైక్యతను దెబ్బతీస్తోందని విమర్శించారు.

ఎస్.ఐ.ఆర్ (SIR) పేరుతో 13 కోట్ల 40 లక్షల మంది ఓట్లను అక్రమంగా తీసివేశారని, ఓట్ చోరీ,నోట్ చోరీ,రిజల్ట్స్ చోరీ ద్వారా తమ ఫాసిస్టు రాజ్యాన్ని శాశ్వతం చేసుకోవాలని చూస్తున్నారని కరపత్రంలో పేర్కొన్న అంశాలను వారు వివరించారు.అమరవీరులకు విప్లవ జోహార్లు,అమరుల సోషలిస్టు స్వప్నాలకు వారసులుగా నిలబడదాం,నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సంయుక్త మండల కార్యదర్శి కోర్సా రామకృష్ణ, రాచన్నగూడెంసర్పంచ్ మడకం విజయ,మండల నాయకులు బండారు నాగేంద్రబాబు,నకిరికంటి నాగేశ్వరరావు,ఎర్ర గొర్ల రామారావు,ఓరుగంటి శ్రీను,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు