మాజీ సర్పంచ్‌కు రోడ్డు ప్రమాదం.. స్వల్ప గాయాలు

02-11-2026 | 12:20am

మహమ్మదాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): మండల పరిధిలోని మంగంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గీతాపాండు(Former Sarpanch Geetha Pandu) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా గండీడ్ మండలం జనంపల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గీతాపాండు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వాళ్లు మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు