పోరాట యోధుడు కామ్రేడ్ పొట్ల రామ నరసయ్యకి విప్లవ జోహార్లు

01-11-2026 | 11:58pm

తుంగతుర్తి (విజయక్రాంతి): గోదావరిలోయ ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్ పొట్ల రామ నరసయ్య(Comrade Potla Ramanarsaiah) 50వ వర్ధంతి సందర్భంగా తిరుమలగిరి మండల కేంద్రంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ అధ్యక్షతన సభ నిర్వహించి రామనరసయ్య స్థూపం వద్ద జెండా ఆవిష్కరణ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి మండరి డేవిడ్ కుమార్ చేసి, తన చిత్రపటానికి ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గంట నాగయ్య పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కామ్రేడ్ పొట్ల రామ నర్సయ్య అట్టడుగు వర్గం నుండి సీపీఐ ఎం.ఎల్ లోకి వచ్చాడు. నాలుగవ తరగతి వరకే చదివిన కామ్రేడ్ పొట్ల రామ నర్సయ్య సమాజాన్ని అధ్యయనం చేశాడు.

పీడిత ప్రజలను దొరల దోపిడీ నుండి భూస్వాముల ఆక్రమణలో ఉన్న వేలాది ఎకరాల భూముల స్వాదీనం కోసం విప్లవించాడు.ప్రజలను ఐక్యం చేసి అనేక ప్రజా పోరాటాలను నిర్మించాడు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ అధ్యక్షులు కునుకుంట్ల సైదులు, పోలేబోయిన కిరణ్, అలుగుబెల్లి వెంకటరెడ్డి, దేసోజు మధు, పుల్లూరి సింహద్రి, జాజుల సామెలు, పల్లెర్ల సోమయ్య, వంపు అమృత, బచ్చు విజయ్, గంట మల్లయ్య, సుధాకర్ రెడ్డి, పల్లెర్ల మల్లేష్, దిగోజు వీరాచారి, ఏర్పుల మల్లేష్, గైగుల్ల అవిలయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు