ఓటు చోరీని అరికట్టాలి.. బీజేపీని గద్దె దించాలి

02-11-2026 | 12:05am

తంగళ్ళపల్లి, నవంబర్ 1 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla district) తంగళ్ళపల్లి మండలం ఓటు చోరీని అరికట్టాలని, ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగాల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సర్ కోఆర్డినేటర్ ప్రవీణ్ టోనీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు.

ఈ  కార్యక్రమంలో సర్ కోఆర్డినేటర్ ప్రవీణ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగాల రాజు,నాయకులు నర్సింగం, భూపతి, ఆనందం,పొన్నాల పరుశురాం, రాజేశ్వర్రావు,సుద్దాల శ్రీనివాస్, సందీప్, హారిక రెడ్డి, పోతారాజు కళ, నాగరాజు, గణేష్, పెద్దురి తిరుపతి, పయ్యావుల శ్రీనివాస్, రాజి రెడ్డి, పరుశురాం,బాబు, మల్లేశం, కరుణాకర్, సుద్దాల శ్రీను, లక్ష్మణ్, ఎడ్ల తిరుపతి,శ్రీశైలం, బండి యుగేందర్, వెంకట్ రెడ్డి, చిలుక,నాయకులు తదితరులు పాల్గొన్నారు._*కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు