అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత
కన్నాయిగూడెం, నవంబర్ 01 (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలోని లక్ష్మిపురం గ్రామపంచాయతీ పరిధిలోని దేవాదుల మూల మలుపు(X రోడ్డు)వద్ద పశువుల రవాణాతో వెళ్తున్న బొలెరో వాహన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు కన్నాయిగూడెం ఎస్ఐ పుట్ట సతీష్ తెలిపారు. ఎస్ఐ పుట్ట సతీష్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ కు చెందిన 4గురు వ్యక్తులు కంతనపల్లి గ్రామం నుంచి బొలెరో (టీజీ 12 8621)లో హైదరాబాద్ కి పశువులను తరలించే సమయంలో దేవాదుల మూల మలుపు వద్ద వాహనం పట్టుబడినట్టు తెలిపారు. పట్టుబడిన బొలెరో వాహనంలో 14 పశువులు ఉన్నాయని తెలిపారు. పశువులతో పట్టుబడిన 4గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.