సోమశిలలో ఉరి వేసుకుని మహిళ మృతి
కొల్లాపూర్ నవంబర్ 1: నాగర్కర్నూల్ జిల్లా(Nagarkurnool district) కొల్లాపూర్ మండల కేంద్రంలోని సోమశిల గ్రామంలో నివాసముంటున్న కాటం పావని రేకుల రూమ్ లో ఇనుప రాడుకు ఉరి వేసుకుని ఆదివారం మహిళా మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ఎలా ఉన్నాయి. సోమశిల గ్రామానికి చెందిన కాటం గంగన్న మల్లేశ్వరం గ్రామానికి చెందిన పావని ఎనిమిదేళ్ల కింద ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
కుటుంబ పరిస్థితులు ఎదుర్కోలేక ఆదివారం పావని ఇంట్లోనే రేకుల రూమ్ ఇనుప రాడుకు ఉరి వేసుకుంది. స్థానికులు చూసి వెంటనే కొల్లాపూర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. మృతురాలు పావని (26) ఇద్దరమ్మాయిలు ఒక బాబు ఉన్నట్టు స్థానికులు తెలియజేశారు. కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఇలాంటి ఫిర్యాదులు చేయలేదు.