క్రీడలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
ములకలపల్లి,(విజయక్రాంతి): క్రీడలు విద్యార్థుల్లో(Sports student) క్రమశిక్షణ పట్టుదలతో పాటు నాయకత్వ లక్షణాలను(Leadership qualities) పెంపొందిస్తాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ(Jare Adinarayana) అన్నారు. ములకలపల్లి మండలంలోని(Mulakalapalli Mandal) కమలాపురం ఆశ్రమ పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(School Games Federation of India) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-14 నుంచి అండర్-17 విభాగాల బాలబాలికల జోనల్ స్థాయి పాఠశాల క్రీడా పోటీలను మంగళవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు,మానసిక వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు.క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం పట్టుదల జట్టుగా పనిచేసే నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. క్రీడా పోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచి వగ్గేల రాధా, ఎంపీడీవో ఎస్.వి సత్యనారాయణ, ఎంఈఓ జి.సత్యనారాయణ,ఆశ్రమ పాఠశాల హెచ్ఎం బుచ్చి రాములు, కాంప్లెక్స్ హెచ్ఎం వెంకట నరసమ్మ, స్థానిక ఎస్ఐ మధు ప్రసాద్,మూడు మండలాలలోని పీడీలు, పీఈటీలు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జహీర్,కారంసుధీర్, కుంజా వినోద్,గాడి తిరుపతిరెడ్డి, ఉపాధ్యాయులు,ములకలపల్లి, పాల్వంచ,బూర్గంపాడు మూడు మండలాలకు చెందిన విద్యార్థినీ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.