BJP కౌంటర్ ప్లాన్

28-10-2026 | 10:35am

ఢిల్లీలో నితిన్ నబీన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర.. ఎందుకో తెలుసా?

ఢిల్లీ, అక్టోబర్ 28 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా SIR (Special Intensive Revision) అంశంపై రాజకీయ వేడి పెరుగుతున్న వేళ బీజేపీ ప్రతిపక్షాలకు Counter ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇండియా కూటమి చేపడుతున్న నిరసనలు, ఓటర్ల జాబితాలపై చేస్తున్న ఆరోపణలకు సమాధానంగా దేశవ్యాప్త ప్రజా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేడు ఢిల్లీలో పాదయాత్ర చేపట్టనున్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని అంతం చేయండి’ అనే నినాదంతో ఈ కార్యక్రమం కొనసాగనుంది.

ఢిల్లీలోని Red Fort నుంచి Chandni Chowk వరకు జరిగే ఈ పాదయాత్ర ద్వారా SIR ప్రక్రియపై ప్రజలకు వివరించి, ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని BJP భావిస్తోంది. పాదయాత్రలతో పాటు Rallies, Press Conferences, ఇతర Public Outreach కార్యక్రమాల ద్వారా ఓటర్ల జాబితాల సవరణపై తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రచారాన్ని నవంబర్ 30 వరకు వివిధ రాష్ట్రాల్లో కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే క్రమంలో తెలంగాణలోనూ బీజేపీ కీలక కార్యక్రమానికి సిద్ధమైంది.

నవంబర్ 2న హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) పాల్గొనే మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. ట్యాంక్‌బండ్‌పై స్వామి వివేకానంద విగ్రహం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు ఈ యాత్ర సాగనుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా SIRపై ప్రతిపక్షాల ప్రచారానికి Counter ఇవ్వడంతో పాటు, పార్టీ వాదనలను ప్రజలకు వివరించాలని నాయకత్వం భావిస్తోంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్రలతో రాజకీయ ప్రచారాన్ని ముమ్మరం చేయడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు