ఎమ్మెల్యే ఎదుట వ్యక్తి వింత ఫిర్యాదు!

28-10-2026 | 10:23am

భార్య కోసం ఐదు రోజులు వెతికా.. ఫ్రీ బస్సు తీసేయండి! 

ఎమ్మెల్యే కవ్వంపల్లి ఎదుట వ్యక్తి ఆవేదన

బెజ్జంకి, అక్టోబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణలో మహిళలకు కల్పిస్తున్న Free Bus Travel Schemeపై ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తన కుటుంబంలో సమస్యలు ఎదురయ్యాయని చెబుతూ రేగులపల్లి గ్రామానికి చెందిన బండి కనకయ్య మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ఆమె ఆచూకీ కోసం ఐదు రోజుల పాటు వెతకాల్సి వచ్చిందని కనకయ్య ఎమ్మెల్యేకు వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలో సుమారు రూ.2 వేలు ఖర్చయిందని తెలిపాడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని తొలగించాలని ఎమ్మెల్యే ఎదుట విజ్ఞప్తి చేశాడు. అయితే, భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడానికి Free Bus Scheme కారణమనే విషయంపై స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు