ట్రాక్టర్ ను డీ కొట్టిన బస్సు

28-10-2026 | 12:08pm

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలోని(Siddipet District) కరీంనగర్ రహదారిపై(Karimnagar Road) మక్కల లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను ఆర్ టి సి బస్సు వెనుక నుండి డీ కొట్టింది. రెండు వాహనాలు సిద్దిపేట నుంచి కరీంనగర్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఇబ్బంది కలగలేదు కానీ మక్కలు సంచులు కింద పడి పగిలిపోయాయి దాంతో ధాన్యం రోడ్డు పాలవడంతో నష్టం జరుగుతుందనీ సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు