పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
అసువులు బాసిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం
పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి
సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావ్, ఎస్సై చంద్రకుమార్ ల ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ
సుల్తానాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): విది నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి(Bhukya Ram Reddy) అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, పొత్కపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పోలీసులు సిఐ పోన్నమనేని రంజిత్ రావు, ఎస్సై చంద్రకుమార్ ల ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవాన్నిపురస్కరించుకొని భారీ సైకిల్ ర్యాలీ(Cycle Rally) నీ తెలంగాణ చౌరస్తా నుండి డీసీపీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో ఉండి ప్రజలకు సేవలు అందించి అసువులు బాసిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. అనంతరం ర్యాలీ తాసిల్ కార్యాలయం, సివిల్ ఆస్పత్రి, శివాలయం, పాత జెండా, పోలీస్ స్టేషన్, రాజీవ్ రహదారి నుండి పూసాల ఎక్స్ రోడ్ నుండి వివేకానంద స్కూల్ వరకు చేరిన ర్యాలీ అనంతరం తిరిగి తెలంగాణ చౌరస్తా కు చేరుకుంది.
ఈ కార్యక్రమం లో ఎస్సైలు చంద్రకుమార్, మధుకర్ రెడ్డి, గట్ల సుధాకర్, సీనియర్ జర్నలిస్టులు కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), కొమురవెల్లి భాస్కర్, పెగడ చందు, న్యాతరి శ్రీనివాస్, చొప్పరి సుమన్ తో పాటు పలువురు జర్నలిస్టులు, సర్కిల్ పరిధిలోని పోలీస్ లతోపాటు వాకర్స్ అసోసియేషన్ సెక్రెటరీ నిట్టూరి శ్రీనివాస్ , క్యాషియర్ కామనీ శ్రీకాంత్ , సభ్యులు, యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపకులు తుమ్మ రాజ్ కుమార్ , ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థులు పలువురు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...