‘తుమ్మిడిహట్టి’తో కొత్త నాటకం

28-10-2026 | 05:25am
  1. డీపీఆర్‌ను బయటపెట్టాల్సిందే
  2. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి) : రాష్ట్రంలో రైతులు(Farmers) సాగునీరు, విద్యుత్ కొరతతో(Power shortage) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) విమర్శించారు. రైతుల సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు(Thummidihatti Project) పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

తుమ్మడిహట్టిపై మహారాష్ట్ర ప్రభుత్వంతో(Government of Maharashtra) చర్చలు జరిపి ఏదో ఘనకార్యం సాధించినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని, దీని వల్ల తక్షణ ప్రయోజనం ఏమటని ప్రశ్నించారు. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. తుమ్మిడిహట్టికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలపై  ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(Comprehensive Project Report) (డీపీఆర్) ఉంటే వెంటనే బయటపెట్టాలని కోరారు.

పాలమూరు- ఎత్తిపోతల పథకాన్ని(Palamuru- Lift Irrigation Scheme) పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చి ఉంటే సంబంధిత జిల్లాలకు సాగునీరు అందేదన్నారు. రాష్ట్రంలో సాగునీటి అవసరాలు తీవ్రంగా ఉన్న సమయంలో అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోకుండా దిగువకు వదిలేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. వరి విత్తనాలు విక్రయించవద్దంటూ సీడ్ దుకాణ యజమానులకు నోటీసులు ఇవ్వడం,  విత్తనాలు కొనుగోలు చేసే రైతుల నుంచి స్వీయ ధృవీకరణ పత్రాలు తీసుకుంటూ భయాందోళనలకు గురిచేస్తున్నారని వాపోయారు.

మేడిగడ్డ బరాజ్ విషయంలో హడావుడిగా ఎన్డీఎస్‌ఏ నివేదిక తెప్పించుకున్న కేంద్రం, బరాజ్ మరమ్మతుల విషయంలో స్పష్టమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ పరస్పరం సహకరించుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్  ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంకా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, కేటీఆర్, హరీశ్‌రావులపై  విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.  

మరిన్ని వార్తలు