గిరిజనులకు ఫైనల్ పట్టాలు ఇవ్వాలి
12-10-2026 | 11:39pm
ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం(Mulakalapalli Mandal) తిమ్మంపేట పంచాయతీ పరిధిలో పోడు, ప్రభుత్వ భూములు(Government lands) కలిగి ఉన్న గిరిజనులకు ప్రభుత్వం ఫైనల్ పట్టాలు ఇవ్వాలని తిమ్మంపేట సర్పంచ్ తుర్రం శ్రీనివాసరావు(Sarpanch Turram Srinivas Rao) అధికారులను కోరారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో సర్పంచ్ ఆధ్వర్యంలో గిరిజనులు అధికారులకు దరఖాస్తులు అందజేశారు.గిరిజనుల సాగులో ఉన్న భూములను సర్వే చేసి పట్టాలు అందజేయాలని అర్హత ఉన్న వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.